
న్యూఢిల్లీ: ‘ఈ భూభాగంలోని ఏ శక్షి కూడా భారతదేశం తన వ్యవహారాలను ఎలా నిర్వహించాలో నిర్దేశించలేదని, బయటి కథనాల ద్వారా ఇక్కడి ప్రజలకు మార్గనిర్దేశం జరగదని’ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పష్టం చేశారు. వైస్ ప్రెసిడెంట్స్ ఎన్‌క్లేవ్‌లో ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్) 2024 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీల సమావేశంలో పాల్గొన్న ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మనది ఒక దేశం. ఇతర దేశాల మధ్య నివసిస్తున్నాం. ఇవన్నీ ఒక సమాజంగా ఉంటాయి. అందరం కలిసి పనిచేస్తాం. మన మధ్య పరస్పర గౌరవం, దౌత్య సంభాషణలు ఉంటాయి. అయినా చివరికి మనం సార్వభౌమాధికారం కలిగి ఉండి, స్వంత నిర్ణయాలు తీసుకుంటామని’ జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కొంతకాలంగా భారత్- పాక్ వివాదంలో కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
VIDEO | Vice-President Jagdeep Dhankhar (@VPIndia) said, “Don't be guided by narratives outside. All decisions in this country, a sovereign nation, are taken by its leadership. There is no power on the planet to dictate India how to handle its affairs. We do live in a nation and… pic.twitter.com/APuMyMZsri
— Press Trust of India (@PTI_News) July 19, 2025
భారత్- పాక్‌లకు తాను వాణిజ్య ఒప్పందాన్ని చూపించడం ద్వారా ఆ దేశాల మధ్య కాల్పుల విరమణ చేయగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని భారత్ ఖండించింది. మే 10న కాల్పులతో పాటు సైనిక చర్యలను నిలిపివేయడంపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇరు దేశాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నేరుగా ఒప్పందాన్ని ఖరారు చేశారని భారత్ తరచూ చెబుతూ వస్తోంది. తాజాగా ట్రంప్.. భారత్-పాక్ ఘర్షణల్లో ఐదు ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు వ్యాఖ్యానించారు.ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని భారత్ స్పష్టం చేసింది.