స్టెమ్‌ కోర్సుల్లో మహిళల ముందడుగు 

More Women Students Now Study STEM Courses In IITs - Sakshi

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో మహిళల చేరికలు 8 నుంచి 22 శాతానికి పెరుగుదల

ప్రభుత్వ ప్రత్యేక కోటాతో ఫలితాలు

దేశంలో స్టెమ్‌ గ్రాడ్యుయేట్లలో మహిళల శాతం 43

అమెరికాలో 34 శాతం, బ్రిటన్‌లో 38 శాతమే

సాక్షి, అమరావతి: ఒకప్పుడు సంప్రదాయ కోర్సులకే పరిమితమవుతూ వచ్చిన మహిళలు ఇప్పుడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులవైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సై­న్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌తో కూడిన స్టెమ్‌ (ఎస్‌టీఈఎం) కోర్సుల్లో వారి చేరిక­లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆలిండియా స­ర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఐష్‌) కొద్దికాలం కిందట విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో స్టెమ్‌ కోర్సుల్లో మహిళల సంఖ్య భారీగా పె­­రిగింది.

సాంకేతిక విద్యాకోర్సులు అమలవుతు­న్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థ­ల్లో వీరి చేరికల శాతం 2016–17లో 8 మా­త్రమే ఉండగా 2020–21 నాటికి 20కి పెరిగింది. 2021–22 విద్యాసంవత్సరంలో ఇది 22.1 శాతానికి చే­­రింది. సాంకేతిక విద్యాకోర్సుల్లో మహిళల చేరికలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కూడా వారికో­సం 2017 నుంచి సూపర్‌ న్యూమరరీ కోటాను ప్రవేశ­పెట్టింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హా­జ­రుతోపాటు అర్హత సాధించడంలోను మ­హి­ళల శా­తం తక్కువగా ఉండేది.

దీనివల్ల ఐఐటీల్లో వా­రిసంఖ్య స్వల్పంగా ఉండేది. సూపర్‌ న్యూ­మరరీ కో­టాను పెట్టడంతో గత ఐదేళ్లలోనే వారి చేరికలు 20 శాతానికి పెరిగాయి. ఎన్‌ఐటీల్లో అయితే వారి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీల్లో 2017లో చేరిన మహిళలు 995 మందే కాగా 2021లో ఆ సంఖ్య 2,990కి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top