స్వామీ స్మరణానంద ఎవరు? ప్రధాని మోదీ ఎందుకు పరామర్శించారు? | PM Modi Visit Kolkata Hospital To Enquire Health About Swami Smaranananda Ji Maharaj, Know Who Is He? - Sakshi
Sakshi News home page

Kolkata: స్వామీ స్మరణానంద ఎవరు? ప్రధాని మోదీ ఎందుకు పరామర్శించారు?

Published Wed, Mar 6 2024 11:58 AM | Last Updated on Wed, Mar 6 2024 12:41 PM

Modi Visit Kolkata Hospital - Sakshi

కోల్‌కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మామీ స్మరణానందను పరామర్శించారు. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రిని సందర్శించారు.

సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్‌ చేస్తూ, పలు ఫొటోలను పంచుకున్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామీ స్మరణానంద మహరాజ్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి తాను ఆసుపత్రికి వెళ్లానని పీఎం మోదీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నామన్నారు. ఆసుపత్రి సందర్శన సమయంలోప్రధాని మోదీ నోటికి మాస్క్‌ ధరించారు. అలాగే చెప్పులు లేకుండా ఆసుపత్రి గదిలోనికి వెళ్లారు. 

రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద... స్వామి ఆత్మస్థానానంద పరమపదించిన అనంతరం 2017 జూలై 17న  అధ్యక్ష పదవిని చేపట్టారు. స్వామి స్మరణానంద తమిళనాడులోని తంజావూరులోని అందమి గ్రామంలో 1929లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సులో  ఆయనకు రామకృష్ణ మఠంతో పరిచయం ఏర్పడింది. 1952లో తన 22 ఏళ్ల వయసులో ఆయన సన్యాసం స్వీకరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement