యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత.. | Maurya Marries Partners At Same Time As Per Tribal Customs | Sakshi
Sakshi News home page

యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..

Published Tue, May 3 2022 12:04 PM | Last Updated on Tue, May 3 2022 12:09 PM

Maurya Marries Partners At Same Time As Per Tribal Customs - Sakshi

ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్​ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 


ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement