
చెన్నై: చెన్నై, ఆలందూర్‌లో పిల్లలు లేరనే విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఆలందూరుకు చెందిన కోటేశ్వరి (30)కి, తిరుచ్చి జిల్లా కూవియలూరుకు చెందిన వినోద్‌కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. గత రెండేళ్లుగా పిల్లలు లేకపోవడంతో కోటేశ్వరి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందింది. అయితే వైద్య నివేదికలో కోటేశ్వరికి ఎలాంటి లోపాలు లేవని తేలింది. దీంతో కోటేశ్వరి తన భర్త వినోద్‌ను వైద్య చికిత్సకు రమ్మని పిలిచినప్పుడు, అతను రాలేదు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీనితో మనస్తాపం చెందిన కోటేశ్వరి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.