ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ | Lalu Prasad Will Visit Ayodhya | Sakshi
Sakshi News home page

Bihar: ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ

Published Mon, Apr 8 2024 2:12 PM | Last Updated on Mon, Apr 8 2024 2:12 PM

Lalu Prasad Will Visit Ayodhya - Sakshi

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత ఈ నెలలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదిలావుండగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి రామాలయ అంశం కలిసివచ్చేదిగా కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా అయోధ్య రామాలయంవైపు దృష్టి సారిస్తున్నారు. 

తాజాగా బీహార్‌లోని పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో పాటు తాను కూడా త్వరలో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని, ఎన్నికల  అనంతరం రామాలయానికి వెళ్తామన్నారు. కాగా బీహార్‌ సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ పాదాలను తాకడంపై మిసా భారతి మాట్లాడుతూ అది మన సంస్కృతి అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement