సుంకిశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి | Kishan: Seeks Probe into Wall Collapse at Sunkishala Tunnel | Sakshi
Sakshi News home page

సుంకిశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి

Aug 11 2024 4:35 AM | Updated on Aug 11 2024 4:36 AM

Kishan: Seeks Probe into Wall Collapse at Sunkishala Tunnel

‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలడంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వాల్‌ ధ్వంసం కావడానికి కారణమేంటో తెలియాల న్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ పిలుపు మేరకు శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో తన తల్లిపేరుతో మొక్కను నాటారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కను నాటాలని ప్రముఖులకు, సెలబ్రి టీలకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ విలీనంపై చర్చలు జరగలేదు
బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై అటు కేంద్ర ఇటు రాష్ట్ర స్థాయిలోనూ చర్చలు జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం వార్తలను మీడియాలోనే చూశానన్నారు.

దానిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు
ఎస్సీ, ఎస్టీల క్రీమీలేయర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై ఆలోచించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఆదేశాలు ఇవ్వ లేదని గుర్తుచేశారు. ఈ విషయంలో ఇప్పుడు కొన సాగుతున్న పద్ధతే కొనసాగుతుందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లపై సమాచారం ఇవ్వలేదు
తెలంగాణలోని గత ప్రభుత్వం కేంద్రం ఇళ్లు ఇచ్చి నా తీసుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ర్పాటై 8 నెలలు గడుస్తున్నా సమాచారం ఇవ్వలే దని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదని అధికారుల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం–మల్కా న్‌గిరి నూతన రైల్వేలైన్‌కు ఆమోదం తెలపడం పట్ల ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సుంకిశాల ఘటనపై న్యాయవిచారణ జరపాలి
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ ఘటన జరిగినా గోప్యంగా ఉంచిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. ఈ ప్రమాదం ఈ నెల 2న జరిగినపుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా దానిని ప్ర భుత్వం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వా నికి సమాచారం ఉందా లేదా అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement