శబరిమలలో ప్లాస్టిక్ షాంపూ, సబ్బులపై నిషేధం | Kerala High Court Bans Sale Of Plastic Shampoos In Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలలో ప్లాస్టిక్ షాంపూ, సబ్బులపై నిషేధం

Nov 7 2025 7:14 PM | Updated on Nov 7 2025 8:42 PM

Kerala High Court Bans Sale Of Plastic Shampoos In Sabarimala

తిరువనంతపురం: శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సాచెట్లను విక్రయించడంతో ఉపయోగించడాన్ని హైకోర్టు నిషేధించింది. పంబ నదితో సహా పంబ నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డివిజన్ బెంచ్ ఈ చర్య తీసుకుంది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును హైకోర్టు దేవస్వం బెంచ్ ఆదేశించింది.

షాంపూ సాచెట్లతో పాటు , పంబ , సన్నిధానం మరియు ఎరుమేలిలలో రసాయన కుంకుమ  అమ్మకాలను కూడా నిషేధించారు. ఈ ఉత్పత్తులు పర్యావరణానికి హానికరం అనే కారణంతో కోర్టు ఈ  నిర్ణయం తీసుకుంది. 

మండల - మకరవిళక్కు సీజన్ 16 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అప్పట్నుంచి హైకోర్టు ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.  ఘన వ్యర్థాలను పారవేయకుండా నిరోధించడానికి కఠినమైన తనిఖీలు నిర్వహించాలని ఎరుమేలి గ్రామ పంచాయతీని సైతం కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement