
బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, నటుడు సుదీప్ సమక్షంలో బొమ్మై..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు.
మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం