కాయిన్‌ వేస్తే బియ్యం.. | Sakshi
Sakshi News home page

కాయిన్‌ వేస్తే బియ్యం..

Published Sat, Aug 29 2020 6:42 AM

Karnataka Government Plans To Set Up Rice ATMS - Sakshi

సాక్షి, బెంగళూరు: నగదు డ్రా చేసుకునే ఏటీఎం తరహాలో బియ్యం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీపీఎల్‌ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్‌ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సరుకుల కోసం రేషన్‌ దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్‌ పెడుతూ ఏ సమయంలోనైనా బియ్యం తీసుకునేలా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ విధానం ప్రపంచంలోని ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానాన్ని ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కర్ణాటకలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య కూడా ఇటీవల ధ్రువీకరించారు. ఏటీఎం రైస్‌ వ్యవస్థపై చర్చ సాగుతోందని, ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement