అమ్మేవి చాయ్‌, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!

Kanpur Chaat Sellers Turn Out To Be Crorepatis Income Tax Gst Probe Reveals - Sakshi

సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్‌, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్‌లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొం‍దరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట.

ఈ పుట్‌ పాత్‌ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు.  కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ‍ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు.

హిందూస్థాన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్‌టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top