చిన్నారిని చిదిమేసింది ఓ సైకోపాత్‌.. వాడిదంతా రక్త చరిత్రే!

Kannauj Minor Physical Attack: suspected Psychopath - Sakshi

రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక సాయం కోసం చేతులు చాచడం.. ఆ చేతులను రక్తపు మరకలు.. సాయం అందించకపోగా వీడియో తీస్తూ కనిపించిన జనం.. వెరసి యూపీ కన్నౌజ్‌ ఘటన మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కన్నౌజ్‌లోని గుర్సాహైగంజ్‌ దగ్గర ప్రభుత్వ గెస్ట్‌ హౌజ్‌ సమీపంలో ఓ బాలిక నిస్సహాయ స్థితిలో పడి ఉంది. సీసీ ఫుటేజీ ద్వారా ఆమెపై దాడికి పాల్పడింది 22 ఏళ్ల వయసున్న రామ్‌జీ వర్మ గా గుర్తించారు పోలీసులు. అయితే అతనికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

ఫర్రూఖాబాద్‌ జిల్లా ఖుదాగంజ్‌కు చెందిన రామ్‌జీ వర్మ.. ఓ సైకోపాత్‌.  మైనర్లు కనిపిస్తే చాలూ.. ఊగిపోతాడు. గతంలో చాలాసార్లు పసిపిల్లలపై దాడులకు యత్నించాడు. అతని మీద అధికారికంగా మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. అందులో ఇద్దరు మైనర్‌ బాలుర్లను లైంగికంగా వేధించి చంపిన కేసులు ఉన్నాయి. 2018లో ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడబోయి దొరికి అరెస్ట్‌ అయ్యాడు కూడా.  కేవలం పదిహేడు రోజుల్లోనే  ఈ మూడు ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఏడాది తర్వాత బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. 

ఇక తాజా దాడిలో గాయపడ్డ బాలిక.. కాన్పూర్‌ రెజెన్సీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top