బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం

Jagat Prakash Nadda 106 year Old bua Died - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త గంగాదేవి శర్మ(106) కన్నుమూశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో ఉంటున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం వ్యాస నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వృద్ధురాలు గంగాదేవి శర్మ మృతితో కులులోని శాస్త్రి నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. జేపీ నడ్డా అత్త ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్‌టేకర్లు ఉన్నారు. నడ్డా బాల్యం అంతా అతని అత్త ఇంట్లోనే గడిచింది. అందుకే నడ్డా.. కులును తన రెండవ స్వస్థలం అని చెబతుంటారు. తాను హిమాచల్‌ను సందర్శించినప్పుడల్లా తన అత్త ఇంటికి వెళ్తానని నడ్డా తెలిపారు.

జేపీ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసర్‌పూర్ జిల్లా నివాసి. కాగా ఇటీవల జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. 
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40  మంది కూలీలు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top