ఈసారి వానలు తక్కువే: ఐఎండీ | IMD Rain Alert | Sakshi
Sakshi News home page

ఈసారి వానలు తక్కువే: ఐఎండీ

Apr 14 2026 1:39 PM | Updated on Apr 14 2026 1:39 PM

IMD Rain Alert

న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement