ఉబర్‌లో జాబ్‌.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే | IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber | Sakshi
Sakshi News home page

Ube: ఉబర్‌లో జాబ్‌.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే

Published Thu, Dec 2 2021 8:21 PM | Last Updated on Thu, Dec 2 2021 8:39 PM

IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber - Sakshi

IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్‌ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి  ట్యాక్సీ రైడ్‌ దిగ్గజ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు..
(చదవండి: హ్యాట్సాఫ్‌ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు)

ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్‌ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
(చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది)

ఈ ఆఫర్‌లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్‌డౌన్‌.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్‌లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్‌ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement