ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..! | Husband And Wife Incident In Karnataka, WhatsApp Drama Ends In Suicide In Dandeli, Police Launch Probe | Sakshi
Sakshi News home page

ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..!

May 3 2026 1:56 PM | Updated on May 3 2026 3:17 PM

husband and wife incident in karnataka

బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను  ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్‌  మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. 

మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకుంది.  నీతో కలిసి  జీవించడం ఇష్టం   లేదని,  కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్‌లో పొటోలు  పంపాడు.  

నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో  జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement