విమానంలో మరో ఘటన..మహిళా ఫ్లైట్‌ అటెండెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన

Foreign Tourist Misbehaved Woman Flight Attendant On GO Firsts Flight - Sakshi

తీవ్ర కలకలం రేపిన ఎయిర్‌ ఇండియాలోని తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. గో ఫస్ట్‌ విమానంలోని మహిళా ఫ్లైట్‌ అటెండెంట్ల పట్ల ఒక విదేశీ టూరిస్ట్‌ అసభ్యంగా ప్రవర్తించి.. వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. జనవరి 5న ఢిల్లీ నుంచిగోవా వెళ్లే గో ఫస్ట్‌ విమానంలో ఈ ఘటన జరిగింది. ఒక విదేశీ పర్యాటకుడుతో ఫ్లైట్‌ అటెండెంట్‌ కూర్చొగా..అతను మరొకరితో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో సదరు వ్యక్తిని గోవాలోని కొత్త విమానాశ్రయంలోని భద్రతా ఏజెన్సీకి అప్పగించారు. ఆ తర్వాత డీజీసీఏకి ఈ విషయమై సమాచారం అందించారు. గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాలు చేసిన రోజే జరగడం గమనార్హం. ఇప్పటికే విమానాల్లో ఇలాంటి ఘటనలపై డైరక్టరేట్‌ జనరల్‌ సవిల్‌ ఏవియేషన్‌ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు వరుసగా బయటకు రావడంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత కమిటీని సైతం డీజీసీఏ ఏర్పాటు చేసింది. 

(చదవండి: వినూత్నంగా జనగణన..ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన బిహార్‌ సీఎం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top