
సీసీటీవీ దృశ్యాలు
అడవిలోనుంచి సతీష్ ఇంటి దగ్గరకు వచ్చిన ఓ చిరుతపులి నిద్రపోతున్న...
బెంగళూరు : చిరుతపులి నోటికి చిక్కిన ఓ కుక్క అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మంగళూరు, పదుకొంజేకు చెందిన సతీష్ అనే వ్యక్తి ముద్‌బిద్రీ అటవీ ప్రాంత పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇతడు టామీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. గత గురువారం అర్థరాత్రి అడవిలోనుంచి ఓ చిరుతపులి సతీష్ ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంటి బయట హాయిగా నిద్రపోతున్న టామీ గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.
అయితే టామీ అదృష్టం బాగుండి చిరుతపులి నోటినుంచి తప్పించుకుంది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. చిరుతపులి దాని వెంట పరిగెత్తకుండా అక్కడే ఉండి పోయింది. దీంతో కుక్క ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫొటేజీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.