బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..  | Sakshi
Sakshi News home page

బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. 

Published Fri, Jul 7 2023 9:24 AM

Doctor Treats Patients Wearing Helmet At Odisha Hospital - Sakshi

భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ హెల్మెట్ ధరించి పేషేంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కనిపించారు. అంతకుముందు రోజున ఆ హాస్పిటల్ పైకప్పు నుండి పెళ్లలు ఊడి పడటమే అందుక్కారణమని చెబుతున్నారు అక్కడి సిబ్బంది.   

ఒడిశా బాలంగిర్ జిల్లా దండముండ హాస్పిటల్లో స్లాబు పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడుతోంది. ఇదే ఆసుపత్రిలో కాంపౌండరుగా పనిచేస్తోన్న సుమంత నాయక్ సోమవారం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు. ఖప్రాకోల్ బ్లాకులో విధులు నిర్వర్తిస్తుండగా తన పక్కన హఠాత్తుగా పైనుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలిపాడు. 

మెడికల్ వార్డులో తనతోపాటు మరికొంతమంది పేషేంట్లు ఉండగా ఈ సంఘటన జరిగిందని అదృష్టవశాత్తు తమకు ఏమీ కాలేదని, అందుకే బైక్ హెల్మెట్ ధరించే డ్యూటీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతడిలాగే ఆసుపత్రి సిబ్బందిలో చాలా మంది భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. 

వారితోపాటే ఈ డాక్టర్ కూడా హెల్మెట్ ధరించుకుని పేషేంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఆయన కూర్చున్న పైభాగంలో కూడా స్లాబు పెచ్చు ఊడిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు. 

ఇక్కడే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బాలకృష్ణ పురోహిత్ మాట్లాడుతూ.. సరైన మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిందని పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.  

ఇక్కడి సిబ్బంది మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే నిర్మించిన అవుట్ పేషేంట్ వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.       

ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి 

Advertisement

తప్పక చదవండి

Advertisement