సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ | Demolition of Illegal Portion of Religious Structure | Sakshi
Sakshi News home page

సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ

Sep 30 2024 2:01 PM | Updated on Sep 30 2024 3:15 PM

Demolition of Illegal Portion of Religious Structure

ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.

అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం  చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.

ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement