బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో

CRPF, DRDO Launches RAKSHITA Bike Ambulance - Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పిఎఫ్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) సంయుక్తంగా కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ "రక్షిత"ను నేడు ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అత్యవసర తరలింపు కోసం ఈ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ల సమయంలో ఏదైనా గాయాలు జరిగితే ఈ బైక్‌లు సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పారామెడిక్స్‌కు సహాయ పడనున్నాయి అధికారులు తెలిపారు.(చదవండి: ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం షాక్‌

"ఈ బైక్‌లు బీజాపూర్, సుక్మా, దంతేవాడ మొదలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే, పెద్ద అంబులెన్స్‌లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి" అని సీఆర్‌పిఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి బైక్‌లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. ముఖ్యంగా నక్సలైట్ జోన్లలో ఇరుకైన రోడ్లలో వేగంగా చేరుకోవడానికి సీఆర్‌పిఎఫ్ గమనించిన తరువాత ఈ బైక్ అభివృద్ధి చేసారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top