Cow Dung: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు, జాగ్రత్త!

With Cow Dung Not Cure Corona Virus Says Gandhi Nagar Doctors - Sakshi

అహ్మదాబాద్‌: ఆవు పేడను శరీరానికి పూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది సరికాదని, దీనివల్ల కరోనా నుంచి రక్షణ లభించదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. పేడను ఒంటికి పట్టించడం మూలంగా బ్లాక్‌ ఫంగస్‌ సహా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 200 ఆవులున్న స్వామినారాయణ్‌ గోశాలకు వారాంతాల్లో కొద్దిమంది వస్తూ... రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే భావనతో ఆవుపేడను ఒళ్లంతా పట్టించి... ఆపై గో మూత్రాన్ని రాసుకుంటున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆవు పేడ, పాలతో శరీరాన్ని కడిగేసుకుంటున్న వీడియోలు, ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విధంగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, కరోనా నుంచి రక్షణ లభిస్తుందని చెప్పడం సరికాదని వైద్యులు తప్పు పడుతున్నారు. అలా తగ్గుతుందని ఏ పరిశోధనల్లోనూ తేలలేదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, గాంధీనగర్‌ డైరెక్టర్‌ దిలీప్‌ మౌలాంకర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు అశాస్త్రీయ పద్ధతులు నేర్పి వారిని ప్రమాదంలోకి నెట్టి వేయొద్దని హితవు పలికారు.

చదవండి: ఆవు పేడతో తగ్గుతున్న కరోనా, ఆందోళనలో డాక్టర్లు?

చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top