పెరుగుతున్న కేసులు: రాష్ట్రమంతటా రాత్రి 9 నుంచే నైట్‌ కర్ఫ్యూ

Covid 19 Cases Raise Karnataka Imposes Night Curfew From 9PM - Sakshi

నెమ్మదిగా పెరుగుతున్న కరోనా కేసులు 

రాజధాని నగరంలో 777 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు 

కర్ణాటక సరిహద్దుల్లో ఆంక్షలు 

కేరళ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో వీకెండ్‌ కర్ఫ్యూ 

రాష్ట్రమంతటా రాత్రి 9 గంటల నుంచే నైట్‌ కర్ఫ్యూ 

23వ తేదీ నుంచి 9, 10, పీయూసీ విద్యార్థులకు తరగతులు  

ప్రాథమిక పాఠశాలలపై నెలాఖరులో నిర్ణయం 

సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేట్‌ పెరుగుతుండటంతో వైరస్‌ కట్టడికి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో కోవిడ్‌ స్థితిగతులపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన నివాస కార్యాలయ కృష్ణాలో మంత్రులు, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌, వివిధ శాఖల సీనియర్‌ అధికారులతో సమావేశం జరిపారు. మహారాష్ట్ర, కేరళ సరిహద్దు జిల్లాలో ప్రస్తుతమున్న నైట్‌ కర్ఫ్యూతో పాటు వీకెండ్‌ కర్ఫ్యూ కూడా అమలు చేయాలని నిర్ణయించారు.

అదే విధంగా రాష్ట్రమంతటా నైట్‌ కర్ఫ్యూను రాత్రి 10 గంటలనుంచి కాకుండా 9 గంటల నుంచే అమలు చేయనున్నారు. 9, 10, 11, 12వ తరగతులను ఈనెల 23 నుంచి రోజు విడిచి రోజు బ్యాచ్‌ల ప్రకారం నిర్వహించేందుకు అనుమతించారు.  ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రారంభంపై నెలాఖరులో నిపుణుల  అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. మంత్రులు డాక్టర్‌ సీ.ఎన్‌.అశ్వత్థనారాయణ, డాక్టర్‌ కే.సుధాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, వైద్య నిపుణులు డాక్టర్‌ సీ.మంజునాథ్, డాక్టర్‌ సుదర్శన్, డాక్టర్‌ దేవిప్రసాద శెట్టి పాల్గొన్నారు. 

1,805 కరోనా కేసులు 
గడిచిన 24 గంటల్లో  1,62,338 కరోనా పరీక్షలను నిర్వహిస్తే 1,805 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. 1854మంది కోలుకున్నారు.  36 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 29,15,317 మందికి కోవిడ్‌ సోకగా, 28,54,222 మంది డిశ్చార్జి అయ్యారు. 36,741 మంది కరోనాకు బలయ్యారు.  24,328 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.  పాజిటివిటీ రేటు 1.11 శాతం, మరణాల రేటు 1.99 శాతంగా నమోదైంది. బెంగళూరులో 441 మందికి కరోనా సోకగా, 7 మంది మరణించారు. 434 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

బెంగళూరులో 80 అపార్టుమెంట్లు సీల్‌డౌన్‌
రాజధాని బెంగళూరుకు మూడో ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.  గత నెలలో బాగా తగ్గిన మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు కరోనా ఉధృతితో  ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బీబీఎంపీ 80 అపార్ట్‌మెంట్లను సీజ్‌  చేయడంతోపాటు 777 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను గుర్తించింది. వీటిలో 157 ప్రాంతాల్లో ఇంకా కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహదేవపురంలో 162 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా, 42 జోన్లలో మరింత ఎక్కువ కేసులు ఉన్నాయి. బొమ్మనహళ్లి విభాగంలో 31, బెంగళూరు దక్షిణంలో 16, యలహంకలో 17, ఆర్‌.ఆర్‌.నగర విభాగంలో 10, బెంగళూరు పశి్చమలో 5, దాసరహళ్లి పరిధిలో 2 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి.  బొమ్మనహళ్లిలో డెల్టా వైరస్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు బీబీఎంపీ అధికారికంగా ధ్రువీకరించింది.

29 ఏళ్ల యువకుడికి జూలై 14న కరోనా వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడు అతని సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తుండగా చిరునామా కూడా తప్పుగా ఉంది. దీంతో సదరు వ్యక్తిని పట్టుకోవడం ఎంతో కష్టంగా మారింది. కొత్త కేసులు సంఖ్య పెరుగుతుండడంతో బీబీఎంపీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అపార్టుమెంట్ల వద్ద గుంపులుగా ఉండకుండా అపార్టుమెంట్‌ సంఘాలు నిఘా పెట్టాలని    సూచించింది. పార్టుమెంట్ల వద్ద కలసికట్టుగా ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో మొత్తం 1736 స్వాబ్‌ టెస్టులను నిర్వహించారు. మెజిస్టిక్, యశవంతపుర, కంటోన్మెంట్, కేఆర్‌ పురం బస్టాండ్లలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ...



 

Read also in:
Back to Top