న్యూఢిల్లీ: 2024నాటి కేసులో మహిళా కాంగ్రెస్ చీఫ్ ఆల్కా లాంబాను ఢిల్లీ కోర్టు దోషిగా ప్రకటించింది. అప్పట్లో ఆమె జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన సమయంలో రహదారిపై బైటాయింపు, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడం వంటి ఆరోపణలపై కేసు నమోదైంది. సోమవారం అదనపు చీఫ్ జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ అశ్వనీ పవార్ ఈ కేసు విచారణ చేపట్టారు.
మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన తెలిపే సమయంలో బాధ్యత గల పౌరురాలిగా ఆల్కా లాంబా వ్యవహరించలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులు చేసిన హెచ్చరికలను సైతం ఆమె పట్టించుకోలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. మోపి నాలుగు నేరారోపణల్లోనూ ఆమెను దోషిగా నిర్ధారించవచ్చని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ఆల్కా లాంబాకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. తీర్పును జూన్ 4వ తేదీన ప్రకటిస్తామని మేజిస్ట్రేట్ తెలిపారు.


