26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం! | Change In Delhi Metro Train Timings On Republic Day 26th January, More Details Inside - Sakshi
Sakshi News home page

Delhi Metro Timings Change: 26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!

Published Thu, Jan 25 2024 11:06 AM

Change in Metro Train Timings on 26 January - Sakshi

దేశంలోని వివిధ ‍ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నిఘా మరింతగా పెంచారు. 

ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తెలిపిన వివరాల  ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి.

ప్రజల‍కు పరేడ్‌ను చూసే అవ​​కాశం కల్పించేందుకు డీఎంఆర్‌సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి  హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్‌సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. 

ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్‌’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్‌ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్‌లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్‌లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు.
 

Advertisement
Advertisement