ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!

Central Govt Employees Will Get RS 10,000 Holi Gift - Sakshi

హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరికి హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కిమ్ కింద రూ.10,000 అడ్వాన్స్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ఎర్రీర్స్‌ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్‌నెస్ అలవెన్స్ హైక్‌ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ కు సంబంధించిన శుభవార్త చెప్పింది.

చదవండి:

హైదరాబాద్ రోడ్ల మీదకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top