BS Yeddyurappa Helicopter Faces Landing Issues in Kalaburgi - Sakshi
Sakshi News home page

మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో

Mar 6 2023 1:45 PM | Updated on Mar 6 2023 2:51 PM

BS Yediyurappa Helicopter Faces Landing Issues In Kalaburgi - Sakshi

బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు తృటిలో ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలట్‌ సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది.  

వివరాల ప్రకారం.. బీఎస్‌ యడియూరప్ప సోమవారం హెలికాప్టర్‌లో కలుబుర్గికి బయలుదేరారు. ఈ క్రమంలో జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్‌ చేసే సమయంలో హెలిప్యాడ్‌ పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో, పైలట్‌కు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొద్దిసేపు ల్యాండింగ్‌ను నిలిపి వేసి ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హెలిప్యాడ్‌ అంతా క్లియర్‌ చేయడంతో హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement