
ఢిల్లీ: నగరంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ నిన్న(శుక్రవారం) బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు బెంచ్‌ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ ఘటనను మరువక ముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టుకు కూడా మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ అమర్చామని.. బాంబులతో కోర్టును పేల్చేస్తామని హెచ్చరించారు. వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
అయితే, ఈ ఘటనల్లో కూడా అవి ఆకతాయిలు చేసిన బెదిరింపు మెయిల్‌లు అని పోలీసుల విచారణలో తేలింది. భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. ఇవాళ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకలేదు. ఇది కూడా ఆకతాయిలు చేసిన మెయిలేనని ఢిల్లీ పోలీసులు తేల్చారు.
#WATCH | Taj Palace Hotel in Delhi received a bomb threat mail. Nothing was found; it has been declared a hoax: Delhi Police pic.twitter.com/OPDEZVnDlH
— ANI (@ANI) September 13, 2025