శివసేన నేతపై కాల్పులు.. సీఎం షిండేపై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్‌ కామెంట్స్‌

BJP MLA Ganpat Gaikwad Says Eknath Shinde Made Me Criminal - Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తనను క్రిమినల్‌గా మార్చాడని గైక్వాడ్‌  ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వివరాల ప్రకారం.. భూ వివాదంలో పోలీస్‌ స్టేషన్‌లోనే షిండే వర్గం శివసేన నేత మహేష్‌ గైక్వాడ్‌పై ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహేష్‌‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థతో టెలీఫోన్‌లో మాట్లాడారు. 

ఈ సందర్భంగా గైక్వాడ్‌.. పోలీసు స్టేషన్‌లో తన కొడుకును కొట్టారని, తన భూమిని బలవంతంగా గుంజుకున్నారని చెప్పారు. ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినట్లయితే ఇలాగే నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుందన్నారు. అతడు తనలాంటి మంచి వ్యక్తిని నేడు క్రిమినల్‌గా చేశాడని ఆరోపించారు. దీంతో, ఫ్రస్టేషన్‌లోనే కాల్పులు జరిపానని, అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌లో కొందరు నా ఎదుటే నా కుమారుడిని కొట్టారు, ఇంతకంటే నేనేం చేయాలి అని ప్రశ్నించారు. వారిని చంపాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. కాగా, మహేశ్‌ గైక్వాడ్‌పై ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ పది రౌడ్ల బుల్లెట్లు అక్కడ లభించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top