బడుల్లో మత చిహ్నాలొద్దు.. మళ్లీ వార్తల్లోకి ‘జై భీమ్‌’ చంద్రూ | BJP Councillor Uma Anandan tears Justice Chandru report walks out of gcc meeting | Sakshi
Sakshi News home page

బడుల్లో మత చిహ్నాలొద్దు.. మళ్లీ వార్తల్లోకి ‘జై భీమ్‌’ చంద్రూ

Jun 26 2024 11:10 AM | Updated on Jun 26 2024 1:08 PM

BJP Councillor Uma Anandan tears Justice Chandru report walks out of gcc meeting

దళితుల హక్కుల కోసం న్యాయమూర్తిగా అనేక తీర్పులిచ్చి.. సూర్య హీరోగా నటించిన జైభీమ్‌ సినిమాకు స్ఫూర్తిగా నిలిచారు జస్టిస్‌ చంద్రు. ఈయన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి పాఠశాలల్లో ఎవరూ ఏ రకమైన మతచిహ్నమూ ధరించ రాదు అని చేసిన సూచన ఇప్పుడు తమిళనాడులో హల్‌చల్‌ చేస్తోంది.

2023 సెప్టెంబర్‌లో నంగునేరిలోని ఓ స్కూల్‌లో 17 ఏళ్ల దళిత బాలుడిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన ఆప్పట్లో వివాదాస్పదం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ ఆధ్వరంలో ఓ కమిటీ వేసింది. అదే సమయంలో.. స్కూల్స్‌లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించటం కొన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్యార్థినులు ధరించే దుస్తులు ఆధారంగా మతాన్ని గుర్తించటం సరికాదని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 

వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ చంద్రూ.. తమిళనాడులోని పాఠశాలల్లో కులాన్ని గుర్తించేలా ఉండే చిహ్నాలను ధరించడాన్ని పూర్తిగా నిషేధించాలంటూ ఓ రిపోర్ట్‌ సమర్పించారు. 

అయితే.. ఈ నివేదిక హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సోమవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్ ఉమా ఆనందన్‌ ఆ రిపోర్టుపై వ్యతిరేక తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆ నివేదికను చించేసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆమెను వెంటనే సస్పెండ్‌ చేయాలని వీసీకే కౌన్సిలర్‌ అంబేద్వాలన్ మేయర్‌ను‌ కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement