Watch: Viral Video Of Mysterious Door To Heaven Like Shadow Appeared In Bengaluru Skies - Sakshi
Sakshi News home page

Bengaluru Skies Mysterious Video: ఆకాశంలో వింత.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! స్వర్గానికి దారి ఇదేనా?

Jul 25 2023 4:32 PM | Updated on Jul 25 2023 4:40 PM

Bengaluru Skies Appears Door To Heaven Like Strange Shadow Goes Viral - Sakshi

ఈ విశ్వంలో మనకు తెలియని వింతలు విడ్డూరాలు చాలానే ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు ఎ‍న్నో సంవత్సరాల నుంచి బోలెడు అంతుచిక్కని విషయాలను బయటపెట్టిన అవి ఈ విశ్వంలో ఉన్నవాటితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.  అప్పుడప్పుడు ఆకాశంలో ఏవో మెరుపులు, వింతలు కనపడడం వాటిని చూసి ఔరా అనుకుంటుంటాం. అలానే దాని గురించి పూర్తిగా తెలియకపోయినా మనకు నచ్చిన, తెలిసిన వాటితో పోలుస్తుంటాం. తాజాగా మేఘావృతమైన ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది.

దీని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అదేమై ఉంటుందని నెట్టింట ప్రస్తుతం చర్చణీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఓ వింత ప్రత్యక్ష్యమైంది. అది చూసేందుకు ఎలా ఉందంటే.. ఆకాశంలో ఉన్న భవనానికి సంబంధించిన తలుపులులా కనిపిస్తూ.. దాని వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది.

ఇక దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారి రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఏమై ఉండవచ్చు? అని ఎవరికి నచ్చిన కామెంట్లు వాళ్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఇది స్వర్గానికి దారి అయ్యిండచ్చని కామెంట్‌ పెట్టగా.. మరికొందరేమో ఇదేంటో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకొందరేమో మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement