భార్య, ఆమె ప్రియుడి తలలతో జైలుకు | Assassination Incident in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భార్య, ఆమె ప్రియుడి తలలతో జైలుకు

Sep 12 2025 5:50 AM | Updated on Sep 12 2025 5:50 AM

Assassination Incident in Tamil Nadu

తమిళనాడులో ఘటన

వేలూరు: భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వి­వ­రాలు.. తమిళనాడులోని కల్ల­కుర్చి జిల్లా మలై కొట్టాలంకు చెందిన కొలంజి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి(46)కి, అదే గ్రా­మా­నికి చెందిన తంగరాసు(39)తో కొంత కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలియడంతో కొలంజి వారిని హెచ్చరించాడు. 

ఈ నేపథ్యంలో తంగరాసు బుధ­వారం అర్ధ­రాత్రి కొలంజి ఇంటిపైన లక్ష్మిని కలిశాడు. వారిని గమనించిన కొలంజి.. తీవ్ర ఆగ్రహావేశంతో ఇంట్లోని కత్తితో ఇద్దరి తలలను నరికాడు. వాటిని బ్యాగులో వేసుకొని గురువారం తెల్లవారు­జామున బస్సులో వేలూరు సెంట్రల్‌ జైలుకు చేరుకున్నాడు. 

అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వారు కల్లకుర్చి పోలీసులకు సమాచా­రమిచ్చారు. కల్లకుర్చి పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొలంజిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement