సీఎం సొంత గడ్డ నుంచే అమిత్‌ షా ప్రచారం!

Amit Shah Will Be In Rajastjans Jodhpur CM Ashok Gehlot Home Turf - Sakshi

జోథ్‌పూర్‌: రాజస్తాన్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తమ పార్టీ శ్రేణులను సమీకరించే పనిలో పడ్డారు. వారి దృష్టి అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేలా యత్నిస్తున్నారు. అందులో భాగంగానే రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ సొంత గడ్డ అయిన జోధ్‌పూర్‌ నంచి ప్రచార పోరు సాగించనున్నట్లు తెలుస్తోంది.

ఆయన ఆ ప్రచార షోలో బీజేపీ ఓబీసీ మోర్చా వర్కింగ్‌ కమిటీ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అమిత్‌షా రెండురోజుల రాజస్తాన్‌ పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం జైసల్మేర్‌లో అడుగుపెట్టారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి కైలాష్‌ చౌదరి స్వాగతం పలికారు. దబ్లా (జైసల్మేర్)లోని సౌత్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో బీఎస్‌ఎఫ్‌ అధికారులతో హోం మంత్రి కాసేపు ముచ్చటించారు.

ఆ తదనంతరం శనివారం ఉదయం తనోత్ మాతా ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత టానోట్‌ ప్రాంగణంలో సరిహద్దు పర్యాటక అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసి జోధ్‌పూర్‌కి పయనమయ్యారు. అక్కడ అమిత్‌ షాకు సుమారు 1500 మందికి పైగా ఘన స్వాగతం పలుకుతారని, పార్టీ కార్యకర్తలంతా మోటార్‌సైకిళ్లపై కుంకుమ తలపాగాలను ధరించి ర్యాలీ రూపంలో విమానాశ్రయం నుచి సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీ అధికారుల తెలిపారు.

అంతేకాదు అక్కడ ఓ హోటల్‌లో పార్టీ ఓబీసీ మోర్చాలో ప్రసంగిస్తారు. ఆ తదనంతరం బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు పార్టీ మొత్తం డివిజన్‌ నుంచి బూత్‌స్థాయి కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్తాన్‌ రాష్ట్రంలో ఓబీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే  అమిత్‌ షా ఈ ప్రచార పోరుని సాగిస్తున్నారు.

(చదవండి: ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్స్‌!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top