ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్స్‌!

BJP Appoints Party IN Charges All Over India - Sakshi

వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పలు రాష్ట్రాల్లో, తెలంగాణలో సైతం కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్లాన్స్‌ రచిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ ప్రముఖులు వచ్చి వెళ్లారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పరిస్థితులపై స్పెషల్‌ నజర్‌ పెట్టిన బీజేపీ.. ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బీజేపీ అధిష్టానం మరోసారి ఆయనకే బాధ్యతలను అప్పగించింది. 

కాగా, శుక్రవారం బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. అందులో భాగంగా తెలంగాణకు మరోసారి బీజేపీ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్‌ను అధిష్టానం ఫైనల్‌ చేసింది. అంతేకాకుండా.. సహ ఇన్‌చార్జ్‌గా అరవింద్ మీనన్‌కు బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ హైకమాండ్.. పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించింది.

కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌ల లిస్ట్‌ ఇదే..

1. తెలంగాణ- తరుణ్ చుగ్, అరవింద్ మీనన్
2. రాజస్థాన్- అరుణ్ సింగ్, విజయ రహత్కార్
3. మధ్యప్రదేశ్- పి.మురళీధర్ రావు, పంకజా ముండే, డాక్టర్ రామ్ శంకర్ కథేరియా
4. కేరళ- ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
5. హర్యానా- బిప్లబ్ కుమార్ దేబ్
6. పశ్చిమ బెంగాల్- మంగళ్ పాండే, అమిత్ మాలవ్యా, సుశ్రీ ఆశా లక్రా
7. బీహార్- వినోద్ తవాడే, హరీశ్ ద్వివేది
8. జార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్ పాయి
9. పంజాబ్- విజయ్ భాయ్ రూపానీ, డాక్టర్ నరీందర్ సింగ్ రైనా
10. చత్తీస్ గఢ్- ఓం మాధుర్, నితిన్ నబీన్
11. త్రిపుర- డాక్టర్ మహేశ్ శర్మ
12. డయ్యూడామన్, దాద్రానగర్ హవేలీ- వినోద్ సోంకర్
13. లక్షద్వీప్- డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
14. చండీగఢ్- విజయ్ భాయ్ రూపానీ
15. ఈశాన్య రాష్ట్రాలకు.. డాక్టర్ సంబిత్ పాత్రా, రుతురాజ్ సిన్హా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top