363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హతకు వీలున్న క్రిమినల్‌ కేసులు

363 MPs, MLAs face criminal cases that attract disqualification if convicted - Sakshi

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఈ కేసులు నిరూపణ అయితే రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ చట్టంలోని 8వ సెక్షన్‌ కింద వీరిపై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్‌ పేర్కొంది. నేరాభియోగాలు నమోదైన వారిలో 39 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2019 నుంచి 2021 కాలానికి 542 మంది లోక్‌సభ సభ్యులు, 1,953 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను విశ్లేషించి ఆయా వివరాలను ఏడీఆర్‌ బహిర్గతంచేసింది. బీజేపీకి చెందిన 83 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 47 మంది కాంగ్రెస్, 25 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  111 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై మొత్తంగా 315 కేసులున్నాయి. బిహార్‌కు చెందిన 54 మంది ఎమ్మెల్యేలపై, కేరళలో 42 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నలుగురు కేంద్ర మంత్రులు, 35 మంది రాష్ట్ర మంత్రులపై కేసులు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top