సక్తీ: ఛత్తీస్‌గఢ్‌లో వేదాంత లిమిటెడ్ విద్యుత్ కర్మా గారంలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన లో 13 మంది కార్మికులు మృత్యువా తపడ్డారు. మరో 22 మంది గాయాలపాలయ్యారు. సక్తీ జిల్లా సింఘితరాయ్ గ్రామంలోని ఈ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. బాయిలర్‌ను కలిపే ట్యూబ్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్‌పీ ప్రఫుల్ ఠాకూర్ చెప్పారు.
నలుగురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారన్నారు. పేలుడు కారణంగా బాయిలర్ చుట్టుపక్కల వేడి తీవ్రంగా ఉండటంతో కార్మికులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించామన్నారు.


