● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బోయ శ్రీనివాసులు
నారాయణపేట: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 5,300 కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఐదు ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేసి.. జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. నారాయణపేట, మక్తల్, కోస్గి కోర్టుల పరిధిలోని వివిధ రకాల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించి.. కక్షిదారులకు అవార్డులు అందజేశారు. ఈ కేసుల పరిష్కారంతో ప్రభుత్వానికి రూ.44,57,474 ఆదాయం సమకూరిందని జిల్లా జడ్జి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి.సాయిమనోజ్, అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కె.అవినాష్, మక్తల్ జూనియర్ సివిల్‌జడ్జి సుష్మిత, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, న్యాయవాదులు సీతారామారావు, నందు నామాజీ, పి.సతీశ్‌కుమార్, కె.నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.


