మహిళల భద్రత.. అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత.. అందరి బాధ్యత

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

నారాయణపేట: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, తక్షణ సాయం అందించడం పోలీస్‌శాఖ ముఖ్య బాధ్యతని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. శనివారం సఖి బృందం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మహిళల భద్రత, అవగాహన పెంపునకు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గృహహింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక దాడులు, బాలికల అక్రమ రవాణావంటి ఘటనలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ, మహిళా సంక్షేమ విభాగం సమన్వయంతో పని చేస్తోందని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవతో పాటు బాధితులకు కౌన్సిలింగ్‌, న్యాయ సాయం, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే సఖి సిబ్బంది బాధితుల వద్దకే చేరుకుంటారన్నారు. 24 గంటలు అందుబాటులో ఉన్న సఖి కేంద్రాన్ని ఫోన్‌నంబర్‌ 08506–295181 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 181ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్‌లైన్‌ 181, సఖి (వన్‌ స్టాప్‌ సెంటర్‌) సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్‌ క్రాంతిరేఖ, కేస్‌ వర్కర్‌ చంద్రకళ, పారా మెడికల్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ డా. వినీత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement