నాణ్యమైన విద్యుత్‌సరఫరాకు చర్యలు
నారాయణపేట: జిల్లాలోని రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈ నవీన్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సింగార్ బేస్, శ్రీనగర్ కాలనీ, శ్యాసన్‌పల్లి రోడ్డు, సరస్వతీ నగర్ కాలనీల్లో విద్యుత్‌శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా, ఓల్టేజీ తదితర సమస్యలను తెలుసుకున్నారు. అయితే సరస్వతీ నగర్‌లో సుమారు 130 ఇళ్లు ఉన్నాయని.. విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో 45 స్తంభాలు అవసరమని.. వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏఈ మహేశ్‌కుమార్‌గౌడ్, లైన్ ఇన్‌స్పెక్టర్ వెంకటన్న, జిల్లా విద్యుత్ కాంట్రాక్టు అసోసియేషన్ అధ్యక్షుడు పోలేమోని కృష్ణ, కాలనీవాసులు లక్ష్మీకాంత్, వెంకట్రామారెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సత్తాచాటినదివ్యాంగ విద్యార్థులు
ఆత్మకూర్: గోల్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్‌బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్‌కు చెందిన విద్యార్థి పవన్‌కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్‌లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
18న రాష్ట్రస్థాయి
షూటింగ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తాండూర్‌లో ఈనెల 18వ తేదీన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు జరుగుతాయని జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆక్యపోగు ఆడమ్స్, బి.పుష్ప మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో ప్రతిభను కనబరిచిన వారిని సౌత్‌జోన్ జాతీయ స్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 17న సాయంత్రం 4గంటలకు తాండూర్‌లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్‌లో క్రీడల నిర్వహణ కార్యదర్శి రాములు (9951343432) రిపోర్టు చేయాలని కోరారు.
ఎర్రకందులు క్వింటా రూ.7,705
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,705, కనిష్టంగా రూ. 5,800 ధర పలికింది. తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,718, కనిష్టంగా రూ. 6,666, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,640, కనిష్టంగా రూ. 2,290 ధరలు వచ్చాయి.
వేరుశనగ క్వింటా రూ.8,661
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,661, కనిష్టంగా రూ.3,056 ధరలు లభించాయి. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,759 కనిష్టంగా రూ.2,569, హంస రూ.1,869, పత్తి గరిష్టంగా రూ.7,439, కని ష్టంగా రూ.5,659, కందులు గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.4,100, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,973, కనిష్టంగా రూ.1,666, ఉలువలు రూ.4,342, మినుము లు గరిష్టంగా రూ.7,882, కనిష్టంగా రూ.7,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు రూ.6,719గా ఒకే ధర లభించింది. కాగా.. సంక్రాంతి సందర్భంగా దేవరకద్ర మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. తిరిగి 17వ తేదీ మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
నాణ్యమైన విద్యుత్‌సరఫరాకు చర్యలు


