గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మరికల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత పెంచే లక్ష్యంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పని చేయాలని ఏడో జోనల్ ఆఫీసర్ విద్యులత అన్నారు. విద్యార్థుల వంద శాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రభుత్వం తీసుకవచ్చిన మార్క్ కార్యక్రమంలో భాగంగా మరికల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల్లో గురువారం ఉమ్మడి జిల్లాలోని 32 ప్రిన్సిపాల్స్‌కు, 150 మంది ఉపాధ్యాయులకు ఈ విషయంపై ఒకరోజు శిక్షణ తరగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 32 బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో పదో తరగతి నుంచి 2432 మంది విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం 1906, రెండో సంవత్సరంలో 1756 మంది విద్యార్థులు వార్షీక పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అందరు ఉతీర్ణత సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందుకు గాను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు గతంలో నిర్వహించిన త్రైమాసిక పరీక్షల జవాబు పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. పరిశీలించిన జవాబు పత్రాల ఆధారంగా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను ఎలా ప్రోత్సాహించాలి, వారిలో మెరుగైన ఫలితలను ఎలా రాబట్టెందుకు తీసుకోవాల్సిన అంశాలను ఆమె వివరించారు. విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రణాళిక ప్రకారం వారికి ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి అందజేసి అర్థవంతమైన పద్ధతిలో బోధన ఉండాలన్నారు. విద్యార్థులకు విద్య పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


