రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
మక్తల్: ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 16 మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా సైక్లింగ్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ గోపాలం ఆదివారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ మక్తల్‌లో ఎంపిక పోటీలు జరగగా.. ఈమేరకు బాలబాలికలు ఎంపికయ్యారని వివరించారు. వీరిలో నవ్య, జ్యోతి, గీతిక, ప్రణిత, త్రివేణి, అంబిక, అబిజ్ఞ, పూజ, మీనాక్షి, మేఘన, శశిప్రియ, శ్రీకాంత్, నవీన్, దర్శన్, కె.శ్రీకాంత్ ఉన్నారని, వీరంతా ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని మేడ్చల్, మల్కాజిగిరిలో జరుగు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై స్కూల్ గేమ్స్ నిర్వహణ కార్యదర్శి ఉషారాణి, ఎస్‌జీఎస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు విష్ణువర్ధన్‌రెడ్డి, మీనాకుమారి వారిని అభినందించారు.


