మిగిలింది రూ. 5 వేలు..
ఉన్న 2 ఎకరాల పొలంలో వానాకాలంలో కంది సాగు చేశా. 7 క్వింటాళ్ల దిగుబడి రాగా.. పేట మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తే క్వింటాకు రూ.7,206 ధర వచ్చింది. పెట్టుబడి రూ.35 వేలు తీసేస్తే ఆరు నెలల పంటకు కనీసం కూలి కూడా మిగలలేదు.
– అనంతయ్య, సాకలోనిపల్లి, దామరగిద్ద
పెట్టుబడి రూ.50 వేలు..
ఉన్న రెండు ఎకరాల పొలంలో పండిన 6 క్వింటాళ్ల కందిని పేట మార్కెట్‌లో విక్రయించా. క్వింటాకు రూ.7,369 ధర పలికింది. మొత్తం రూ.44,214 చేతికందగా.. పెట్టుబడి రూ.50 వేలు అయింది. రూ.5,786 నష్టం వచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం కావడంతో నష్టపోతున్నాం.
– కతలప్ప, రైతు, పెద్దజట్రం, ఊట్కూర్
7 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు
జిల్లాలోని నారాయణపేట, ధన్వాడ, నర్వ, మక్తల్, కోస్గి, దమ్‌గాన్‌పూర్, దామరగిద్ద పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– నర్సింహరావు, మార్క్‌ఫెడ్ డీఎం, మహబూబ్‌నగర్
కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి..
మూడున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తే భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి అంతంతే చేతికందగా క్వింటా రూ.7,032 ధరకు విక్రయించా. పెట్టిన పెట్టుబడి సైతం చేతికందలేదు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉంటే రూ.5 వేలు మిగిలేవి.
– ఈరప్ప, రైతు, పేరపళ్ల, నారాయణపేట
●
మిగిలింది రూ. 5 వేలు..
మిగిలింది రూ. 5 వేలు..


