పోలీస్ సిబ్బందికి రివార్డులు
నారాయణపేట: పలు కేసులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేయడం, కేసుల విచారణలో టెక్నాలజీ వినియోగం, ఉత్తమ సేవలు అందించిన జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ శ్రీనివాసరావు రివార్డులు అందజేశారు. ఐటీ కోర్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, సభ్యులు మహేష్, మాగనూర్ టెక్ టీమ్ సభ్యుడు నీలయ్య గౌడ్, ధన్వాడ స్టేషన్ నుంచి వినయ్‌కుమార్‌లు రివార్డులు అందుకున్నారు. డిజిటల్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్ విభాగం చూపిస్తున్న కృషి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని, టెక్నాలజీని సమర్థంగా వినియోగించినప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఈ రివార్డులు స్పష్టంగా చాటిచెబుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎస్పీ వినీత్ రివార్డులు అందుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
పీయూ అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సౌత్‌జోన్, ఇంట ర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే పాలమూ రు యూనివర్సిటీ అథ్లెటిక్స్ జట్లకు ఎంపికలు నిర్వహించారు. బుధవారం పీయూ పరిధిలో పోటీలను వీసీ శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్న వసతులను వినియోగించుకుని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


