నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
నారాయణపేట: వేసవిలో గృహ, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈ బాలస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీఎల్‌ఆర్ సెంటర్‌లో మంగళవారం విద్యుత్‌శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో వందశాతం విద్యుత్ బిల్లులు వసూలయ్యే విధంగా పనిచేయాలన్నారు. వేసవిలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో ఎస్‌ఈ డి.నవీన్‌కుమార్, డీఈ బీఎల్ నర్సింహారావు, డీఈటీ జితేందర్, ఏఈ మహేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


