వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట: కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. లక్షలాది కార్మి కు లు, నిరుపేదల గొంతుకగా నిలిచిన మహోన్న త వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. ఒక సాధారణ కార్మికుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కార్మిక హక్కు ల కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నర్సింహ, ఆర్‌ఎస్‌ఐలు శ్వేత, శిరీష, మద్దయ్య పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ.2,799
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,799, కనిష్టంగా రూ.1,869 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.1,862, కనిష్టంగా రూ.1,841, కందులు గరిష్టంగా రూ.6,831, కనిష్టంగా రూ.5,710, వేరుశనగ గరిష్టంగా రూ.8,260, కనిష్టంగా రూ.3,029, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,981, కనిష్టంగా రూ.1,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,705, కనిష్టంగా రూ.2,409గా ధరలు లభించాయి.
వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం


