నారాయణపేట
న్యూస్‌రీల్
వెనకబాటు, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు.. దేవుళ్లను కొలువడంలో మాత్రం ఘనమైన చరిత్రను లిఖించుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధాన దేవాలయాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపాటి ఆలయాల వరకు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, జాతర్లు కొనసాగుతాయి. ప్రతి జాతర సుమారు నెలరోజుల పాటు నిర్వహించడం ఇక్కడి విశేషం. వీటి కోసం పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లిన పాలమూరు కూలీలంతా స్వగ్రామాలకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి దేవుడిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి.. మట్టి కుండలో అన్నం వండి.. పచ్చి పులుసుతో నైవేద్యం సమర్పిస్తారు. సమీప గ్రామాల ప్రజలు బంధుమిత్రులతో కలిసి ఎద్దుల బండ్లపై ఆయా ఆలయాలకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే గడపడానికి ఇష్టపడతారు. ఇక ఆయా జాతర్ల నిర్వహణతో వివిధ రకాల సేవలు, హుండీ ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ప్రత్యేకతపై ‘సాక్షి’ కథనం..
– మహబూబ్‌నగర్ డెస్క్
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


