24న కోసి్గకి సీఎం రాక
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్లు
కోస్గి: కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నార ని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. శనివారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్‌హాల్‌లో ఇరు జిల్లాల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టాలని, 24న మధ్యాహ్నం 2 గంటల కు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో కోస్గికి చేరుకుంటారన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరుకానున్నారని, వారికి వసతులు కల్పించాలన్నారు. సన్మానం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతోపాటు నూతన సర్పంచ్‌లు మధ్యాహ్న భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చి.. వెళ్లే వరకు అన్ని బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టర్లు సన్మాన వేదిక, సీఎం వచ్చే మార్గం, వీఐపీ వాహనాల పార్కింగ్, భోజనం చేసే స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని డీఎస్పీ లింగయ్య తెలిపారు. అనంతరం కలెక్టర్ కడా అభివృద్ధి నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రూ.800 కోట్లతో చేపడుతున్న విద్యాహబ్, మెడికల్ కళాశాల పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌నాయక్, వికారాబాద్ టైనీ కలెక్టర్ హర్షచౌదరి, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీఆర్‌డీఓ మొగులప్ప, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్, ఏడి జాన్‌సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
24న కోసి్గకి సీఎం రాక


