రాజీమార్గంతోనే కేసుల పరిష్కారం
నారాయణపేట: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కారం చేసుకోవాలని.. రాజీ మార్గం ఎంతో మేలని జిల్లా జడ్జి బోయశ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను పరిష్కరించాలని శనివారం జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులకు త్వరగా కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు ముందుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, దొంగతనం, కరోనా సమయంలోని పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఎగ్జిక్యూషన్ పిటిషన్ , క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు, సివిల్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులపై ఆరాతీశారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ వింధ్య నాయక్ పాల్గొన్నారు.


