‘తుది’ పోరుకు సై..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు.
ఏకగ్రీవం పోనూ 504 జీపీల్లో పోలింగ్..
షెడ్యూల్ ప్రకారం మూడో విడతలో ఉమ్మడి జిల్లాలో 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. మరో ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు.
7 సర్పంచ్.. 58 వార్డులు ఖాళీ..
ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో మూడో విడతలో ఏడు సర్పంచ్, 58 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎస్టీ రిజర్వ్ కాగా.. అక్కడ ఆ సామాజిక వర్గం లేకపోవడంతో నామినేషన్ దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ మండలంలోని లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగర్, చారగొండ మండలంలోని ఎర్రతండా సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆయా జీపీల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 48, జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.
మహబూబ్‌నగర్
5
(అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, జడ్చర్ల, బాలానగర్)
జో.గద్వాల
5
(అలంపూర్, ఎర్రవెల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి, మానవపాడు)
(వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్)
వనపర్తి
5
అక్కడక్కడ ‘విధుల’ లొల్లి..
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఇదివరకే బాధ్యతలు కేటాయించిన విషయం తెలిసిందే. మెడికల్ లీవ్‌లో ఉన్న వారికి సైతం విధులు కేటాయించడంతో ఆయా జిల్లా ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల సామగ్రి పంపిణీ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పలువురు మహిళా ఉద్యోగులు తమ చంటి పాపలను ఎత్తుకుని వచ్చి.. విధుల నుంచి మినహాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒక్కో ఉద్యోగికి మూడు దఫాలు విధులు కేటాయించడం.. కొందరికి అసలే కేటాయించకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లా ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పీఓలు, ఏపీఓలు జోనల్ అధికారితో వాగ్వాదానికి దిగారు. బస్సుల రూట్ మ్యాప్ సరిగా ఇవ్వలేదని.. ఏ బస్సు కేటాయించారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జిల్లాలు, మండలాల వారీగా వివరాలు
నేడు చివరి విడత సం‘గ్రామం’
563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు
ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్
5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం
‘తుది’ పోరుకు సై..
‘తుది’ పోరుకు సై..
‘తుది’ పోరుకు సై..
‘తుది’ పోరుకు సై..
‘తుది’ పోరుకు సై..


