ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
మాగనూర్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలను బుధవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని.. ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆర్డీఓ రాంచందర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గిన నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఎన్టీఆర్ కాల్వ కు 848 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.


